టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సుకుమార్ రూపొందించిన హై ఓల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ పుష్ప. అల్లు అర్జున్, రష్మిక మండన్నా జంటగా నటించిన ఈ చిత్రం గతేడాది చివరిలో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి నుండి ఈ సినిమాను కేజీఎఫ్ తో పోలుస్తూ రావటం వల్ల ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేసారు సుకుమార్. అయితే కెజిఎఫ్ తో పోల్చటం వల్ల పుష్ప 2 పై కొన్ని అనవసర రూమర్లు కూడా బాగా జోరుగా సాగుతున్నాయి. పుష్ప ను రెండు భాగాలుగా తీసుకొస్తామని ముందే దర్శకుడు సుకుమార్ ప్రేక్షకులకు క్లారిటీ ఇచ్చేసారు. ప్రస్తుతం పుష్ప 2 పనుల్లో బిజీగా ఉన్న సుకుమార్ అండ్ టీం, ఆ స్క్రిప్ట్ కు మార్పులు చేర్పులు చేస్తున్నారని గతకొంతకాలంగా చిత్రసీమలో వార్తలు వస్తున్నాయి. కేజీఎఫ్ 2 సూపర్ హిట్ కావడం వల్లనే పుష్ప 2 కి మార్పులని కూడా వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై పుష్ప నిర్మాత వై. రవి శంకర్ క్లారిటీ ఇచ్చారు. "కేజీఎఫ్ 2 ప్రభావం మా సినిమాపై ఎందుకుంటుంది? ఇప్పటికే పుష్ప 2 హై ఓల్టేజ్ స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది. సుకుమార్ దానికి ఎలాంటి మార్పులను చెయ్యట్లేదు. గత కొంతకాలంగా లొకేషన్స్ కోసం తీవ్రంగా శోధిస్తున్నాం.... అంటూ రవి శంకర్ చెప్పుకొచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa