భారతీయ స్క్రీన్స్ పై ఐకానిక్ జోడీలలో స్టార్ హీరో షారుక్ ఖాన్ అండ్ గ్లామర్ బ్యూటీ కాజోల్ ఒకరు. ఈ స్టార్ పెయిర్ సినిమాలలో అద్భుతమైన కెమిస్ట్రీని ప్రదర్శిస్తారు. ఈ క్యూట్ పెయిర్ మళ్ళి స్క్రీన్ పై కలిసి కనిపించనున్నారు అని సమాచారం. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, కరణ్ జోహార్ దర్శకత్వంలో షారూక్ మరియు కాజోల్ అతిధి పాత్రల్లో కనిపించనున్నట్లు లేటెస్ట్ టాక్. ఈ మూవీకి 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో రణవీర్ సింగ్, అలియా భట్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa