రాజశేఖర్ హీరోగా నటించిన సినిమా 'శేఖర్'. మలయాళంలో సూపర్ హిట్టయిన 'జోసెఫ్' సినిమాకి ఇది అఫీషియల్ రీమేక్. జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాజశేఖర్ కూతురు శివాత్మిక ఆయన కూతురుగా నటించింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ని ప్రకటించారు చిత్ర బృందం. ఈ నెల 5న ‘శేఖర్’ సినిమా ట్రైలర్ ను విడుదల చేయనున్నారు.ఈ చిత్రం ఈ నెల 20న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa