టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య, షెర్లీ సెటియా జంటగా నటించిన చిత్రం కృష్ణ వ్రిoద విహారి. అనీష్ కృష్ణ దర్శకత్వంలో, ఐరా క్రియేషన్స్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి మహాతిస్వరసాగర్ స్వరాలనందించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లు యువతను ఆకర్షిస్తున్నాయి. రా వర్షంలా... రా వర్షంలో వెన్నెల్లా అంటూ సాగే రొమాంటిక్ మెలొడీకి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ దక్కింది తాజాగా, మంగళవారం ఈ మూవీ నుండి మరో లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేసే డేట్ ని తెలుపుతూ ఒక స్పెషల్ పోస్టర్ను విడుదల చేసారు చిత్రబృందం. ఏముంది రా అంటూ సాగే ఈ పాట నాగశౌర్య,షెర్లీ ల మధ్య సాగే కలర్ఫుల్ డ్యూయెట్ సాంగ్ గా ఉండనుందని తెలుస్తోంది. పోస్టర్లో హీరోహీరోయిన్ల స్టిల్ యువతను ఆకర్షించే విధంగా ఉంది. షెర్లీ లుక్ డిఫరెంట్ గా గ్లామరస్ గా ఉంది. ఈ పాటను పూర్తిగా మే 4న రిలీజ్ చేయబోతున్నారు. వైవిధ్యమైన కథాకథనాలతో రూపొందుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ కీలకపాత్రలో నటిస్తున్నారు.
చాలా కాలంగా సాలిడ్ హిట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు శౌర్య. ఈ సినిమాతోనైనా శౌర్య విజయాల బాట పట్టాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. పోతే... మే 20 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa