సర్కార్ వారి పాట చిత్రం ప్రీ ఈవెంట్ కు సిద్దమవుతోంది. మహేశ్ బాబు - కీర్తి సురేశ్ జంటగా 'సర్కారువారి పాట' రూపొందింది. మైత్రీ - 14 రీల్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాకి, పరశురామ్ దర్శకత్వం వహించాడు. తమన్ స్వరపరిచిన పాటలు ఇప్పటికే పాప్యులర్ అయ్యాయి. లవ్ .. యాక్షన్ .. కామెడీ ప్రధానంగా నడిచే ఈ సినిమాను ఈ నెల 12వ తేదీన విడుదల చేయనున్నారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి టీమ్ సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 7వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదులో నిర్వహిస్తున్నారు. యూసఫ్ గూడాలోని పోలీస్ గ్రౌండ్స్ ఇందుకు వేదిక కానుంది. ఆ రోజు సాయంత్రం నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa