శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ "రామారావ్ ఆన్ డ్యూటీ". రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో నాజర్, పవిత్రా లోకేష్, తనికెళ్ల భరణి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలకు ప్రేక్షకులు, అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సెకండ్ సింగిల్ అప్ డేట్ ను చిత్ర యూనిట్ అందించింది. ఈ చిత్రం నుండి సెకండ్ సింగిల్ సొట్టల బుగ్గల్లో సాంగ్ మే 7న పాటను విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ కొత్త పోస్టర్ ద్వారా వెల్లడించింది. జూన్ 17న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa