మన టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రాల్లో ఎప్పుడు నుంచో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న చిత్రం “విరాట పర్వం” కూడా ఒకటి. దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కించిన ఈ సినిమా నక్సల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కగా రానా సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది.అయితే దగ్గుబాటి అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ఫైనల్ గా థియేటర్స్ లోనే రిలీజ్ కి స్టిక్ అయ్యి ఉంది. అయితే ఇప్పుడు మేకర్స్ ఒక బిగ్ అప్డేట్ ను అందించారు. ఈ సినిమా మోస్ట్ అవైటెడ్ రిలీజ్ అప్డేట్ ని ఈరోజు సాయంత్రం 5 గంటలకి రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.మరి ఆ డేట్ ఎప్పటికి ఫిక్స్ అయ్యిందో చూడాలి. ఇక ఈ చిత్రంలో ప్రియమణి తదితరులు కీలక పాత్రల్లో నటించగా సురేష్ ప్రొడక్షన్స్ వారు మరియు ఎస్ ఎల్ వి సినిమాస్ వారు నిర్మాణం వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa