ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన విశాల్-సూర్య 'మార్క్ ఆంటోని'

cinema |  Suryaa Desk  | Published : Fri, May 06, 2022, 12:23 PM

ఎనిమీ, సామాన్యుడు చిత్రాలతో హిట్ కొట్టిన కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ప్రస్తుతం తన తదుపరి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఈ స్టార్ హీరో ఒక క్రేజీ ప్రాజెక్ట్ ని అధికారకంగా ప్రకటించాడు. ఈ చిత్రంలో ఎస్ జె సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకి 'మార్క్ ఆంటోని' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా పూజా కార్యక్రమాలతో అధికారికంగా ఈ సినిమా లాంచ్ అయింది. విశాల్‌, సూర్య ఇద్దరూ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు అని లేటెస్ట్ టాక్. ప్రస్తుతం మార్క్ ఆంటోని షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో విశాల్ సరసన రీతూ వర్మ జోడిగా కనిపించనుంది. జివి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. మినీ స్టూడియో బ్యానర్‌పై వినోద్ కుమార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa