యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న సినిమా 'మైఖేల్'. ఈ సినిమాకి రంజిత్ జెయకోడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటిస్తుంది. తాజాగా ఈ యాక్షన్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని మే 7 న రిలీజ్ చేస్తునట్టు చిత్ర బృందం తెలిపింది.ఈ పాన్-ఇండియన్ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో విడుదల కానుంది. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పి నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa