పరశురామ్-మహేష్ బాబు కలయికలో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన మూవీ సర్కారువారిపాట. ఇందులో కీర్తి సురేష్ కధానాయిక. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, GMB ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ కి థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన కళావతి, పెన్నీ,SVP టైటిల్ పాటలు శ్రోతలను మైమరిపిస్తున్నాయి. ఇకపోతే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా మే 12 న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఇటీవలనే భారీ ధరకు జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీకి రూ. 120 కోట్ల వ్యాపారం జరిగింది. రూ. 121 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగబోతుందన్న మాట. దీంతో టాలీవుడ్ లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న చిత్రాల్లో ఈ మూవీ పదవ స్థానానికి చేరుకుంది. అంతేకాకుండా మహేష్ బాబు గత చిత్రం స్పైడర్ (రూ124 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్) తర్వాత SVP నే ఎక్కువ బిజినెస్ జరుపుకోవడం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa