ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెల్కమ్ ఆన్ బోర్డ్ శ్రీకాంత్... 'తలపతి 66' మూవీ టీం ఆహ్వానం...

cinema |  Suryaa Desk  | Published : Tue, May 10, 2022, 09:06 PM

కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ 66వ సినిమాగా తెరకెక్కుతున్న చిత్రానికి తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం చేయనున్నారు. ఇందులో హీరోయినిగా రష్మిక మండన్నా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాతో దిల్ రాజు కోలీవుడ్ నిర్మాణరంగంలోకి ప్రవేశిస్తున్నారు.  ఇటీవలనే పూజా కార్యక్రమంతో లాంఛనంగా ప్రారంభమై రెగ్యులర్ షూటింగును జరుపుకుంటుంది.  ఈ చిత్రంలో సీనియర్ నటుడు శ్రీకాంత్ నటించబోతున్నట్టు తెలుస్తోంది. ట్విట్టర్ వేదికగా ఈ అధికారిక ప్రకటన మంగళవారం వెలువడింది.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa