విశ్వక్ సేన్, రుహానీ శర్మ జంటగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హిట్: ది ఫస్ట్ కేస్. హీరో నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతి త్రిపురనేని నిర్మించిన ఈ సినిమా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా తెరకెక్కి సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఈ చిత్రాన్ని అదే టైటిల్ తో హిందీలో రీమేక్ చేశారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తో కలిసి టి - సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మించారు. బాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో రాజ్ కుమార్ రావ్, దంగల్ ఫేమ్ సాన్యా మల్హోత్రా ఇందులో జంటగా నటించారు. హిందీలో కూడా శైలేష్ కొలను దర్శకుడిగా వ్యవహరించారు. నిజానికి ఈ సినిమా మే 20న విడుదలవ్వాల్సి ఉంది, కానీ దిల్ రాజు ప్రొడక్షన్ సంస్థ విడుదల తేదీని మారుస్తూ అధికారిక ట్వీట్ చేసింది. జూలై 15వ తేదీన ఈ సినిమాను విడుదల చెయ్యబోతున్నట్టు వెల్లడించింది. ఉత్తరాదిన ఈ సినిమా పట్ల పాజిటివ్ వైబ్స్ వినిపిస్తున్నాయి. ఈ మూవీతోనైనా దిల్ రాజుకు బాలీవుడ్ లో శుభారంభం కలుగుతుందా? అన్నది ఆసక్తిగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa