ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కార్తీ తో కలిసి సూర్య ఖైదీ సీక్వెల్ చేస్తున్నాడా?

cinema |  Suryaa Desk  | Published : Fri, May 13, 2022, 12:46 PM

తమిళ హీరో కార్తి వైవిధ్యభరిత సినిమాలను చేస్తూ తమిళ, తెలుగు భాషలలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.  కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా ప్రయోగాత్మక సినిమాలు కూడా చేస్తుంటారు. ఈ కోవలోనే లోకేష్ కనగరాజన్ డైరెక్షన్లో ‘ఖైదీ’ సినిమా చేశారు. ‘నగరం’ వంటి థ్రిల్లర్ మూవీని తెరకెక్కించిన లోకేష్ కనకరాజ్ ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండానే  ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టారు. కేవలం ఛేజింగ్‌లు, ఫైట్లు, ఎమోషన్స్‌తోనే రెండున్నర గంటల పాటు సినిమాను నడిపించారు. క్లైమాక్స్ లోనే ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉంటుందని చిన్న హింట్ ఇచ్చారు. 2019లో విడుదలైన ఈ సినిమాకు 2022లో సీక్వెల్ ముహూర్తం ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కమల్ హాసన్ తో విక్రమ్ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న లోకేష్ ఆ సినిమా విడుదలైన వెంటనే ఖైదీ సీక్వెల్ ప్రాజెక్ట్ పై కసరత్తులు మొదలెట్టనున్నారని టాక్. అయితే, ఈ సినిమాలో కార్తీ సోదరుడు, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా నటించనున్నారని తాజా సమాచారం. ఇదే కనక నిజమైతే, ఈ మూవీకి ఉన్న క్రేజ్ మరింత పెరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన విషయాలు త్వరలోనే అధికారికంగా వెలువడనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa