మధుసూదన్ రెడ్డి దర్శకత్వంలో శ్రీరామ్, ఎల్సా మరియు శుభశ్రీ నటిస్తున్న సినిమాకి మూవీ మేకర్స్ 'రుద్ర వీణ' అనే టైటిల్ ని లాక్ చేసారు. ప్రతీకార కథాంశంతో తెరకెక్కుతున్నఈ సినిమా విభిన్నంగా ఉంటుంది అని సమాచారం. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. తాజాగా ఈరోజు హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.... 'రుద్ర వీణ' టీమ్‌కి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని ఆయన తెలిపారు. ఈ చిత్రంలో రఘు కుంచె విలన్ గా నటిస్తున్నారు. చలాకీ చంటి, సోనియా, రమణా రెడ్డి కీలక పాత్రలో కనినిపించనున్నారు. మహావీర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని లక్ష్మణ్ నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa