'అర్జున్ రెడ్డి' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తో ఒక సినిమా చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ కి ఇంకా మేకర్స్ టైటిల్ ని లాక్ చేయలేదు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ థ్రిల్లర్ డ్రామాలో రష్మిక మందన్న లేదా కియారా అద్వానీ ప్రభాస్‌తో జతకట్టనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్‌కి జోడిగా రష్మిక లేదా కియారాలో ఒకరిని మేకర్స్ లాక్ చేయనున్నారు అని లేటెస్ట్ టాక్. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాలు మరికొన్ని రోజుల్లో వెల్లడి కానున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ 'ప్రాజెక్ట్ కే' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa