శైలేష్ కొలను దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'హిట్-ది ఫస్ట్ కేస్' సినిమా బాక్స్ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా హిందీలో కూడా అదే టైటిల్‌తో రీమేక్ అవుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రలో నటించారు. ఈ రీమేక్‌కు కూడా శైలేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా మూవీ మేకర్స్ ఈరోజు సినిమా విడుదలను ప్రకటించారు. ఈ చిత్రం జూన్ 15,2022న విడుదల కానుంది అని ప్రకటించారు. ఈ చిత్రంలో సన్యా మల్హోత్రా, రోహన్ సింగ్, షాను కుమార్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మణికందన్ సినిమాటోగ్రాఫర్ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు, భూషణ్ కుమార్ మరియు కులదీప్ రాథోడ్ నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa