భారత మాజీ కెప్టెన్ మరియు ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని త్వరలో కోలీవుడ్‌లో లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటించనున్న ఒక తమిళ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు గత కొన్ని రోజులగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తా ఇప్పుడు సోషల్ మీడియా అండ్ ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ముగిసిన వెంటనే ఈ ప్రాజెక్ట్ ప్రకటించబడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. సంజయ్ అనే వ్యక్తి ఈ ప్రాజెక్ట్‌ను హ్యాండిల్ చేస్తారని లేటెస్ట్ టాక్. అయితే తాజాగా ఇప్పుడు, ధోనీ ప్రొడక్షన్ హౌస్, ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ ప్రాజెక్ట్‌పై క్లారిటీ ఇచ్చింది. ప్రెస్ స్టేట్‌మెంట్‌లో ధోని ఎంటర్‌టైన్‌మెంట్ ప్రస్తుతం సంజయ్ అనే ఎవరితోనూ పనిచేయడం లేదు అంటూ వెల్లడించారు. నయనతార ప్రస్తుతం రెండు తమిళ సినిమాలు, ఒక తెలుగు సినిమాతో బిజీగా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa