ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్పిరిట్ కోసం .. నన్నెవరూ అప్రోచ్ అవలేదు - కియారా

cinema |  Suryaa Desk  | Published : Mon, May 16, 2022, 03:43 PM

అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో డార్లింగ్ ప్రభాస్ ఒక సినిమాకు కమిటైన విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ ను స్పిరిట్ అని అధికారికంగా ప్రకటించారు కూడా. ప్రస్తుతం ప్రాజెక్ట్ కే, సలార్ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఆ సినిమా షూటింగులు అయిపోయిన వెంటనే స్పిరిట్ ను స్టార్ట్ చేస్తాడు. ఈలోపు సందీప్ కూడా రణ్ బీర్ తో చేస్తున్న యానిమల్ షూటింగును పూర్తి చేసుకుని స్పిరిట్ కోసం సిద్ధంగా ఉంటాడు. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా రష్మిక మండన్నా కానీ, కియారా అద్వానీ కానీ నటించే అవకాశాలున్నాయని చిత్రవర్గంలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్తలపై కియారా కు సంబంధించిన సన్నిహిత వర్గం స్పందించి, స్పిరిట్ రూమర్లకు చెక్ పెట్టింది.  స్పిరిట్ లో హీరోయిన్ గా కియారా పేరు వినిపించటంలో ఎలాంటి నిజం లేదని, ఆ చిత్రబృందం లో ఎవరూ కూడా కియారాను సంప్రదించలేదని, అలాంటిదేమన్నా ఉంటే, కియారా అధికారికంగా ప్రకటిస్తుందని చెప్పారు. 


ప్రస్తుతం కియారా హిందీలో భూల్ భులాయియా చిత్ర విడుదల కోసం ఎదురుచూస్తుంది. తెలుగులో రామ్ చరణ్-శంకర్ మూవీలో కియారానే హీరోయిన్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa