షూటింగ్ స్పాట్ లో ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన 'ఇండియన్ పోలీస్ ఫోర్స్' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సిద్ధార్థ్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. షూటింగ్‌లో సిద్ధార్థ్‌కు గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. విలన్లను చితకబాదే ఫైటింగ్ సీన్‌లో సిద్ధార్థ్ నిజంగానే గాయపడ్డాడు. సిద్ధార్థ్ తన చేతి నుంచి రక్తం కారుతున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మరోవైపు సిద్ధార్థ్ ఈ యాక్షన్ సన్నివేశాన్నిఆ గాయాలతోనే పూర్తి చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa