సినిమా నటి అంటే గ్లామర్ ప్రపంచం.. విలాసవంతమైన జీవితం అనుకుంటాం.. కానీ ఆ లగ్జరీ వెనుక ఎన్నో సర్జరీలు ఉంటాయని మర్చిపోకూడదు. వారి గ్లామర్ వెనుక ఘోరమైన ముగింపు కూడా ఉంది. తాజాగా ఓ నటి పెద్ద హీరోయిన్ కావాలనే కన్నడ యువ నటి చేతనరాజ్ కల చెదిరిపోయింది.
అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసిన చేతన రాజ్‌కి నిరాశే మిగిలింది. తన అందాన్ని రెట్టింపు చేసుకుంటే కెరీర్ సెట్ అవుతుందని ఆశించింది. చివరకు ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఫ్యాట్ ఫ్రీ సర్జరీ కోసం బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిని ఆశ్రయించింది చేతన రాజ్. ఈ నెల 16న శస్త్ర చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరింది. శస్త్రచికిత్స తర్వాత ఆమె ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. చాలా నీరు ఆమె ఊపిరితిత్తులలోకి ప్రవేశించింది. ఒక్కసారిగా ఆరోగ్య పరిస్థితి విషమించింది. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆమె ప్రాణాలను కాపాడలేకపోయారు. తన కుమార్తె అకాల మరణానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు.
ఈ దుర్ఘటనలో సినీ పరిశ్రమతో పాటు సరైన వైద్య పరికరాలు, నిపుణులు లేకుండా వైద్యం చేసారని ఆసుపత్రిని తప్పుబట్టారు. ఇలాంటి సర్జరీలు చేతన రాజ్ కు ఎం ఆత్రమే చేయడమే కాదు.. మిగతా హీరోయిన్లు కూడా ఎక్కువైపోతున్నారు.కానీ వారు విదేశాలకు వెళ్లి మంచి ఆసుపత్రుల్లో వీటిని చేయించుకుంటున్నారు. రిస్క్ అని తెలిసినా ఫిజిక్, గ్లామర్ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. హీరోయిన్ల అందం పెంచుకోవడం కోసం ఈ దుస్థితికి దిగజారుతున్నారు. వారి ప్రాణాలు మెడకు తెచ్చుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa