సినీ నటి సమంత ప్రస్తుతం సౌత్ ఇండియాలోని టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఉంది. ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. సమంత తాజాగా ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్ సిరీస్ లో సమంత నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి. అంతేకాకుండా ఈ వెబ్‌సిరీస్‌తో సమంతకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా క్రిటిక్స్ ఛాయిస్ సంస్థ సమంతకు ఉత్తమ నటి అవార్డును అందించింది. ఈ అవార్డు పట్ల సమంత సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఇన్స్టాగ్రామ్‌లో అవార్డుతో దిగిన ఫోటోను షేర్ చేసింది. పలువురు సినీప్రముఖులు, అభిమానులు సమంతకు అభినందనలు తెలుపుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa