ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటిటిలో సందడి చేయనున్న 'కన్మణి, రాంబో, ఖతీజా' మూవీ

cinema |  Suryaa Desk  | Published : Tue, May 17, 2022, 08:48 PM

 కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి హీరోగా, లేడీ సూపర్ స్టార్ నయనతార, గ్లామరస్ హీరోయిన్ సమంత హీరోయిన్లుగా రూపొందిన చిత్రం కాతువాకుల రెండు కాదల్. తెలుగులో కన్మణి -రాంబో-ఖతీజా గా ఏప్రిల్ 28న విడుదలైంది. ఆ తర్వాతి రోజు తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మూవీ రిలీజ్ కావడంతో, కొంతమందికి ఈ సినిమా విడుదలైనదన్న విషయం కూడా తెలియదు. దీంతో తెలుగులో ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. తమిళనాట ఈ సినిమా మంచి విజయం సాధించింది. ముందు నుండి ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో అంచనాలు ఉండటంతో అక్కడ కలెక్షన్లను కూడా బాగానే రాబట్టింది. తాజాగా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ పై ఇంటరెస్టింగ్ న్యూస్ ఒకటి చిత్రసీమలో ప్రచారంలో ఉంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుక్కున్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ వారు మే 27 నుండి ఈ మూవీని స్ట్రీమింగ్ చెయ్యబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు హాట్ స్టార్ సంస్థ అన్ని ఏర్పాట్లను చేస్తుందట. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందట. విఘ్నేష్ శివన్ తెరకెక్కించిన ఈ మూవీకి అనిరుద్ సంగీతమందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa