టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ఒక చిత్రంలో నటిస్తున్నారన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. బాలయ్య సినీ కెరీర్లో ఇది 107వ సినిమా కావడంతో NBK #107 గా పిలుస్తున్నారు. గోపీచంద్ మలినేని, బాలయ్య గత చిత్రాలు క్రాక్, అఖండ రెండు బ్లాక్ బస్టర్లే. వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా కావటంతో ప్రేక్షకులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా నుండి అప్డేట్ లు కూడా వస్తున్నాయి. ఇటీవల విడుదల చేసిన బాలయ్య రగ్డ్ లుక్ కు ప్రేక్షకుల నుండి విపరీతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా పై ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ చిత్రసీమలో హల్చల్ చేస్తుంది. గడ్డలకొండ గణేష్ చిత్రంతో 'సూపర్ హిట్టు' ఐటెం సాంగ్ తో కుర్రకారును అలరించిన డింపుల్ హయతి బాలయ్య 107 వ సినిమాలో కూడా ఐటెం సాంగ్ చేయనుందని టాక్. ఇప్పుడు తాజాగా ఈ పాటను డింపుల్ రిజెక్ట్ చేసిందని మరో వార్త వినబడుతోంది. ఖిలాడీ చిత్రంతో ఐటెం భామ కాస్తా హీరోయిన్ గా మారిన విషయం తెలిసిందే. ఈ చిత్రం డింపుల్ కు కొన్ని పెద్ద చిత్రాలలో అవకాశాన్ని తెచ్చిపెట్టింది. ఇలాంటి సమయంలో మళ్ళీ ఐటెం సాంగ్ చేస్తే, తన హీరోయిన్ అవకాశాలకు దెబ్బ పడుతుందని భావించి బాలయ్య తో ఆడిపాడటానికి డింపుల్ నో చెప్పిందట. డింపుల్ ప్లేస్ లో ఇండియన్ - ఆస్ట్రేలియన్ మోడల్ చంద్రికా రవి తో NBK 107లో ఐటెం సాంగ్ చేయిస్తున్నారని వినికిడి. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందట. ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రుతిహాసన్ కథానాయిక గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం లో మలయాళ స్టార్ యాక్టర్ దునియా విజయ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa