టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, వివి వినాయక్ దర్శకత్వంలో తన తొలి బాలీవుడ్ సినిమాని చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా ప్రభాస్ నటించిన 'ఛత్రపతి' సినిమాకి అధికారిక రీమేక్. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన నటిస్తున్న గ్లామర్ బ్యూటీని అనౌన్స్ చేశారు. డ్రీమ్ గర్ల్ మరియు చోరీ వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న నుష్రత్ భారుచ్చా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నట్లు మూవీ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. సాహిల్ వైద్, అమిత్ నాయర్, రాజేంద్ర గుప్తా, శివం పాటిల్, వేదిక, స్వప్నిల్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి తనీషిక్ బచ్చి సంగీతం అందించారు. పెన్ మూవీస్ మరియు పెన్ మరుధర్ సినీ ఎంటర్‌టైన్‌మెంట్ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa