హీరో సూర్య, జ్యోతిక దంపతులతో పాటు దర్శకుడు జ్ఞానవేల్ పై కేసు నమోదైంది. జై భీమ్ సినిమాలోని కొన్ని సమావేశాలు వన్నియర్ సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయని రుద్ర వన్నియర్ సేన వ్యవస్థాపకుడు సంతోష్ గతంలో వేళచ్చేరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులు ఈ ఫిర్యాదును పట్టించుకోలేదు. దీంతో ఆయన కోర్టులో పిటిషన్ వేశాడు. వెంటనే ఈ కేసు పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కోర్టుకు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.