ఈ రోజుల్లో ట్రెండ్ ఎలా ఉందంటే, ఒక సినిమా హిట్టయినా, ఫట్టయినా సదరు హీరో ప్రేక్షకులకు కృతజ్ఞతలో, క్షమాపణో తెలుపుతూ ట్వీట్ చేస్తున్నారు. గని సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయినందుకు ప్రేక్షకులకు, మెగా అభిమానులకు సారీ చెప్తూ వరుణ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. వరుణ్ చేసిన పని ప్రశంసనీయమైంది. అలానే, ఆర్ ఆర్ ఆర్ సినిమా భారీవిజయాన్ని సాధించినందుకు జూనియర్ ఎన్టీయార్, రామ్ చరణ్ లిద్దరూ కూడా ప్రేక్షకాభిమానులకు కృతజ్ఞతలను తెలుపుతూ థాంక్యూ నోట్ లను విడుదల చేసారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ట్రెండ్ ఫాలో అవుతూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసారు. మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం సర్కారువారిపాట. మే 12న విడుదలైన ఈ సినిమా వారంలోనే రూ. 160కోట్ల గ్రాస్ క్లబ్ లోకి చేరింది. ఓవర్సీస్ లో సర్కారోడి గెలుపు పరుగును ఎవరు అందుకోలేంత వేగంగా ఉంది. ఇటీవలే మ మ మ మాస్ సెలెబ్రేషన్స్ పేరిట SVP సక్సెస్ సెలెబ్రేషన్స్ ను నిర్మాతలు ఘనంగా నిర్వహించారు. SVP ను బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిపినందుకు అభిమానులకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియచేస్తూ మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ చేసారు. ఈ మేరకు SVP చిత్రబృందం మొత్తానికి మహేష్ థాంక్స్ చెప్పారు.
A big thank you to the entire team of #SarkaruVaariPaata, my director @ParasuramPetla for giving me this amazing film, @KeerthyOfficial, producers @GMBents @MythriOfficial @14ReelsPlus and @MusicThaman for his incredible music! #SVP will always remain special
— Mahesh Babu (@urstrulyMahesh) May 18, 2022
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa