గతకొంతకాలంగా పరాజయాలతో బాధపడుతున్న కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నాత్తే ఫ్లాప్ తర్వాత తన కొత్త సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో చేయనున్నారన్న విషయం తెలిసిందే. తన 169 వ సినిమా కు దర్శకత్వం వహించే అవకాశాన్ని నెల్సన్ కు పిలిచి మరీ ఇచ్చారట సూపర్ స్టార్ . ఇటీవల నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన బీస్ట్ ఘోరపరాయమైనా ఈ సినిమా ఫలితానికి ఏమాత్రం లోను కాకుండా, నెల్సన్ ప్రతిభపై నూరుశాతం నమ్మకముంచి తనతోనే సినిమా చెయ్యాలని రజినీ డేరింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఈ నిర్ణయం అభిమానులను ఒకింత ఆశ్చర్యపరిచినా తుదకు మిగిలే ఫలితంపై అంతటా ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ మూవీ పై ఇంటరెస్టింగ్ న్యూస్ ఒకటి చిత్రసీమలో హల్చల్ చేస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ ఆగస్టు నుండి సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. వరస షెడ్యూల్స్ ను ఎడతెరిపి లేకుండా జరిపి వచ్చే సంవత్సరం ఏప్రిల్ నెలలో రిలీజ్ చెయ్యాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. ఈ ప్రెస్టీజియస్ మూవీని సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa