ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త విడుదల తేదీని లాక్ చేసిన సత్యదేవ్ 'గాడ్సే'

cinema |  Suryaa Desk  | Published : Thu, May 19, 2022, 11:55 AM

గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ 'గాడ్సే' సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ మూవీలో సత్య దేవ్ సరసన ఐశ్వర్య లక్ష్మి లేడీ లవ్‌గా నటించింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాని జూన్ 17న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. విడుదల తేదీని ప్రకటించేందుకు మూవీ టీమ్ ఒక స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. తనికెళ్ల భరణి, నాగబాబు కొణిదెల, బహ్మాజీ, నోయల్ సీన్, ప్రియదర్శి, నాజర్, సిజ్జు మీనన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. సికె స్క్రీన్స్ బ్యానర్‌పై సి కళ్యాణ్ ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ అండ్ శాండీ అద్దంకి సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa