ప్రముఖ సినీ నటుడు కెప్టెన్ చలపతి చౌదరి కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ రాయచూర్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించి కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చలపతి చౌదరి పలు దక్షిణాది సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. బాలకృష్ణ హీరోగా నటించిన 'అఖండ' సినిమాలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. తెలుగు, తమిళ, కన్నడలో కలిపి మొత్తం 100 సినిమాల్లో నటించారు. అలాగే పలు సీరియల్స్‌లో కూడా నటించారు. విజయవాడకు చెందిన చలపతి చౌదరి రాయ్‌చూర్ లో స్థిరపడ్డారు.