ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటిటిలో సందడి షురూ చేసిన శ్రీవిష్ణు భళా తందనాన

cinema |  Suryaa Desk  | Published : Fri, May 20, 2022, 12:47 PM

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు, కేథరిన్ థెరెసా జంటగా నటించిన చిత్రం భళా తందనాన. మే 6న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించటంలో విఫలమైంది. శ్రీవిష్ణు లాంటి డిఫరెంట్ స్టోరీ టేస్ట్ ఉన్న హీరో రొటీన్ కథను చెయ్యడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపలేదు. చైతన్య దంతులూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి మణిశర్మ మ్యూజిక్ అందించారు. ఊహలు గుసగుసలాడే, ఈగ వంటి సెన్సిటివ్ సబ్జెక్టులను తెరకెక్కించిన వారాహి సంస్థ వారు ఈ సినిమాను నిర్మించారు. సినిమా విడుదలకు ముందు రిలీజైన కాన్సెప్ట్ పోస్టర్లు, ట్రైలర్ ఇంటరెస్టింగ్ గానే ఉన్నప్పటికీ పూర్తి సినిమా తెరపై మ్యాజిక్ ను చెయ్యలేకపోయింది. దీంతో ఈ సినిమా అనుకున్న సమయానికన్నా ముందుగానే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ రోజు నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో భళా తందనాన అందుబాటులోకి వచ్చింది. యావరేజ్ టాక్ తో భళతందనాన ను థియేటర్లలో చూడటానికి ఇంటరెస్ట్ చూపించని ప్రేక్షకులు ఓటిటి లో చూడటానికి మాత్రం ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ సినిమా ఓటిటిలో ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa