నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘అంటే సుందరానికి'. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మలయాళ బ్యూటీ నజ్రియా నాజిమ్ డైరెక్ట్ గా చేస్తున్న తొలి తెలుగు చిత్రమిదే. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యార్నేని, రవి శంకర్ నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తయినప్పటి నుండి చిత్రబృందం ఎదో ఒక అప్డేట్ ఇస్తూ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ వచ్చేలా చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్, టీజర్, లిరికల్ సాంగ్ లకు ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ దక్కింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa