టాలీవుడ్ హీరో మంచు విష్ణు నటించిన హిట్ మూవీస్ లో 'ఢీ' ఒక్కటి. ఈ సినిమాలో విష్ణు సరసన గ్లామర్ బ్యూటీ జెనీలియా డి సౌజా జోడిగా నటించింది. ఈ సినిమా ఇటీవలే 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. తాజాగా ఇప్పుడు విష్ణు మరియు జెనీలియా జిమ్‌లో కలుసుకోగా వారు 'ఢీ' చిత్రం నుండి ఒక ఐకానిక్ స్టిల్‌ను రి-క్రియేట్ చేసారు. మంచు విష్ణు ట్విట్టర్‌లో 'నా టింకర్ బెల్ మరియు నేను' అనే క్యాప్షన్‌తో ఈ పిక్‌ని పోస్ట్ చేసారు. జెనీలియా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీగా ఈ ఫోటోను షేర్ చేసింది. మంచు విష్ణు ప్రస్తుతం ఈషాన్ సూర్యతో తన తదుపరి షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్ కథానాయికలుగా నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa