పరశురామ్ పెట్ల దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా అన్ని చోట్ల సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తుంది. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కీలక పాత్రలో కనిపించనున్నారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 11 రోజులలో 153 కోట్లు వాసులు చేయగా, ఓవర్సీస్ లో 27.4 కోట్లు మరియు ఇతర ప్రాంతాలలో ఈ సినిమా 14.9 కోట్లు వాసులు చేసింది. దీంతో ఈ సినిమా టోటల్ గా ప్రపంచ బాక్సాఫీస్ వద్ద 196 కోట్లు వాసులు చేసింది. GMB ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. థమన్ స్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa