ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తన తదుపరి చిత్రంలో స్కూల్ టీచర్‌గా కనిపించనున్న అల్లరి నరేష్

cinema |  Suryaa Desk  | Published : Tue, May 24, 2022, 01:51 PM

మహర్షి, నాంది సినిమాలతో హిట్ కొట్టిన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ తన తదుపరి ప్రాజెక్ట్ ని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసందే. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆనంది కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి 'ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంటెన్స్‌గా అందరని ఆకట్టుకుంది. తాజా రిపోర్ట్స్ ప్రకారం, అల్లరి నరేష్ ఈ సినిమాలో ఎలక్షన్ డ్యూటీపై గ్రామానికి వెళ్లే స్కూల్ టీచర్‌గా కనిపించనున్నాడని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీత అందిస్తుండగా, హాస్య మూవీస్ అండ్ జీ స్టూడియోస్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa