ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాటల మాంత్రికుడు చెయ్యలేని పని కొరటాల వల్ల అవుతుందా?

cinema |  Suryaa Desk  | Published : Tue, May 24, 2022, 01:57 PM

ఆర్ ఆర్ ఆర్ పాన్ ఇండియా సక్సెస్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ 30 సినిమాను ఎనౌన్స్ చేసాడు. రీసెంట్ గా ఎన్టీఆర్ 30 మూవీ నుండి మోషన్ పోస్టర్ రిలీజయ్యింది. తారక్ చెప్పిన హై ఇంటెన్స్ పవర్ఫుల్ డైలాగ్ తో ప్రేక్షకుల్లో తగినంత బజ్ నైతే తీసుకొచ్చారు కానీ, కొరటాల హైపర్ ఇంటెలిజెన్స్ తో చెప్పిన ఈ డైలాగ్ కొంతమంది ప్రేక్షకులకు మాత్రం సరిగా అర్ధం కాలేదు.  ఈ విషయాన్ని పక్కన పెడితే, మోషన్ పోస్టర్ ను డార్క్ విజువల్ తో డిజైన్ చేసిన తీరు, రాకింగ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పోస్టర్ ను మరో లెవెల్ కు తీసుకెళ్లేలా ఉంది. ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ కంపోజర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించారు. 

గతంలో అనిరుద్ సంగీతం అందించిన పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి, నాని జెర్సీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పేలవ ప్రదర్శనతో వెనుదిరిగాయి. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన అజ్ఞాతవాసి సినిమాకు అనిరుద్ మంచి పాటలను అందించినప్పటికీ, ట్యూన్స్ కమర్షియల్ సినిమాకు తగినట్టుగా లేకపోవడంతో  థియేటర్లకు ఆడియన్స్ ను రిపీటెడ్ గా రప్పించలేకపోయాయి. తెలుగు భాషపై మరింత పట్టు పెంచుకుని తన తదుపరి టాలీవుడ్ చిత్రాన్ని చెయ్యమని త్రివిక్రమ్ అనిరుద్ కు ఓపెన్ గా సలహా కూడా ఇచ్చాడు. 

తాజాగా జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమాకు సంగీతమందించటంతో, అనిరుద్ నుండి కొరటాల ఎలాంటి సంగీతాన్ని రాబట్టుకుంటాడో అని అంతటా ఆసక్తి నెలకొంది. కొరటాల డైరెక్ట్ చేసిన సినిమాలను ఒకసారి గమనిస్తే, ఆయా సినిమాల పాటలు చాలా మెలోడియస్ గా ఈ కాలంలో వినటానికి కూడా చాలా బావుంటాయి. తనకు కావాల్సిన మ్యూజిక్ ను అలానే కధకు సరిపడే మ్యూజిక్ ను సంగీతదర్శకుల నుండి రాబట్టడంలో కొరటాల మంచి దిట్ట. అలాంటి దర్శకుడు, తమిళ కంపోజరైన అనిరుద్ నుండి తన సినిమాకు కావాల్సిన సంగీతాన్ని ఏ మేరకు రాబట్టుకుంటాడో చూడాలి.మాటల మాంత్రికుడు చెయ్యలేని పని కొరటాల వల్ల అవుతుందా?

ఆర్ ఆర్ ఆర్ పాన్ ఇండియా సక్సెస్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ 30 సినిమాను ఎనౌన్స్ చేసాడు. రీసెంట్ గా ఎన్టీఆర్ 30 మూవీ నుండి మోషన్ పోస్టర్ రిలీజయ్యింది. తారక్ చెప్పిన హై ఇంటెన్స్ పవర్ఫుల్ డైలాగ్ తో ప్రేక్షకుల్లో తగినంత బజ్ నైతే తీసుకొచ్చారు కానీ, కొరటాల హైపర్ ఇంటెలిజెన్స్ తో చెప్పిన ఈ డైలాగ్ కొంతమంది ప్రేక్షకులకు మాత్రం సరిగా అర్ధం కాలేదు.  ఈ విషయాన్ని పక్కన పెడితే, మోషన్ పోస్టర్ ను డార్క్ విజువల్ తో డిజైన్ చేసిన తీరు, రాకింగ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పోస్టర్ ను మరో లెవెల్ కు తీసుకెళ్లేలా ఉంది. ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ కంపోజర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించారు. 

గతంలో అనిరుద్ సంగీతం అందించిన పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి, నాని జెర్సీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పేలవ ప్రదర్శనతో వెనుదిరిగాయి. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన అజ్ఞాతవాసి సినిమాకు అనిరుద్ మంచి పాటలను అందించినప్పటికీ, ట్యూన్స్ కమర్షియల్ సినిమాకు తగినట్టుగా లేకపోవడంతో  థియేటర్లకు ఆడియన్స్ ను రిపీటెడ్ గా రప్పించలేకపోయాయి. తెలుగు భాషపై మరింత పట్టు పెంచుకుని తన తదుపరి టాలీవుడ్ చిత్రాన్ని చెయ్యమని త్రివిక్రమ్ అనిరుద్ కు ఓపెన్ గా సలహా కూడా ఇచ్చాడు. 

తాజాగా జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమాకు సంగీతమందించటంతో, అనిరుద్ నుండి కొరటాల ఎలాంటి సంగీతాన్ని రాబట్టుకుంటాడో అని అంతటా ఆసక్తి నెలకొంది. కొరటాల డైరెక్ట్ చేసిన సినిమాలను ఒకసారి గమనిస్తే, ఆయా సినిమాల పాటలు చాలా మెలోడియస్ గా ఈ కాలంలో వినటానికి కూడా చాలా బావుంటాయి. తనకు కావాల్సిన మ్యూజిక్ ను అలానే కధకు సరిపడే మ్యూజిక్ ను సంగీతదర్శకుల నుండి రాబట్టడంలో కొరటాల మంచి దిట్ట. అలాంటి దర్శకుడు, తమిళ కంపోజరైన అనిరుద్ నుండి తన సినిమాకు కావాల్సిన సంగీతాన్ని ఏ మేరకు రాబట్టుకుంటాడో చూడాలి.

SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa