టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో స్టార్ హీరోలు వెంకటేష్, వరుణ్ తేజ్ లు కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం ఎఫ్ 2. 2018లో విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ గా ఎఫ్ 3 ను తెరకెక్కించారు. ఎఫ్ 2 లో లీడ్ రోల్స్ చేసిన వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ లే ఎఫ్ 3 లో కూడా లీడ్ రోల్స్ చేస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. వేసవి కానుకగా మే 27న ప్రేక్షకులకు ముందుకు రాబోతున్న ఈ మూవీ టికెట్లు సాధారణ రేట్లలోనే ఉండబోతున్నట్టు ఈ మధ్యనే మేకర్స్ ధృవీకరించారు. తాజాగా ఈ సినిమా ప్రదర్శన ముఖేష్ యాడ్ లేకుండానే ఉండబోతుందని తెలుస్తుంది. ధూమపాన నివారణకై ప్రతి చిత్ర ప్రదర్శనకు ముందుగా ముఖేష్ యాడ్ ను ప్రదర్శిస్తారు. అయితే, ఎఫ్ 3 చిత్రంలో ఎలాంటి ధూమపాన సన్నివేశాలు లేకపోవడంతో ముఖేష్ యాడ్ ఈ సినిమాకు అవసరం లేకుండా పోయింది. ఎఫ్ 3 చిత్రం పూర్తి వినోదభరిత చిత్రమని, తగినంత గ్లామర్ పాళ్ళు కూడా ఉంటాయని చిత్రబృందం చెప్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa