టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన సినిమా కార్తికేయ. 2014లో వచ్చిన ఈ సినిమా నిఖిల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దీంతో ఈ సినిమా సీక్వెల్ పై మొదటి నుండి మంచి అంచనాలు నెలకొన్నాయి. కార్తికేయ 2 సినిమా ఎప్పుడో మొదలైంది కానీ కోవిడ్ వల్ల ఈ మూవీ షూటింగ్ పలు మార్లు వాయిదాపడింది. కార్తికేయ లో హీరోయిన్ గా కలర్స్ స్వాతి నటించగా, కార్తికేయ 2లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఇంకా ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.
చిత్రీకరణ ముగింపు దశకు చేరుకున్న ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా జూలై 22 న విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ఇదివరకే ప్రకటించింది. తాజాగా మేకర్స్ ఈ మూవీని తెలుగు తో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే చిత్రబృందం అధికారికంగా ప్రకటించేంత వరకు వేచిచూడాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa