ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ. 200 కోట్ల క్లబ్ లో సర్కారువారిపాట

cinema |  Suryaa Desk  | Published : Tue, May 24, 2022, 04:29 PM

మహేష్ బాబు నటించిన సర్కారువారిపాట బాక్సాఫీస్ వద్ద తన హవాను కొనసాగిస్తుంది. తొలుత మిక్స్డ్ టాక్ వచ్చినా, టికెట్ రేట్లు అధికంగా ఉన్నా... ఇవేవి ఈ సినిమాకు ప్రేక్షకుల రాకను ఆపలేకపోయాయి. SVP మేకర్స్ తెలుపుతున్న అధికారిక సమాచారం మేరకు, ఈ సినిమా 12 రోజుల్లో రూ. 200 కోట్లను వసూలు చేసింది. దీంతో 2022 టాలీవుడ్ హయ్యెస్ట్ గ్రాసర్ మూవీ గా సర్కారువారిపాట నిలిచింది. ఈ విషయాన్ని తెలుపుతూ, మైత్రీ మూవీ మేకర్స్ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసింది. 


పరశురామ్ డైరెక్షన్లో ఔటండౌట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటించింది. ఈ సినిమాలో మహేష్ పోషించిన పాత్రకు ప్రేక్షకాభిమానుల నుండి బిగ్ అప్లాజ్ వచ్చింది. మహేష్ యాటిట్యూడ్, డైలాగ్ డెలివరీ, లుక్స్ ... పోకిరి రోజులను గుర్తు చేస్తాయి. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ సినిమాలోని పాటలన్నీ చార్ట్ బస్టర్ గా నిలిచాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa