ప్రముఖ ఇంటర్నేషనల్ ఓటిటి దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యే "స్ట్రేంజర్ థింగ్స్" అనే సూపర్ హిట్ వెబ్ సిరీస్ తాజాగా నాల్గవ సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 2016లో మొదలైన ఈ సిరీస్ 2022లో నాల్గవ సీజన్ తో ముగియనుంది. సైన్స్ ఫిక్షన్, హర్రర్, డ్రామా నేపథ్యంలో ఉండే ఈ సిరీస్ కు రూపకల్పన చేసింది ది డఫర్ బ్రదర్స్. 21లాప్స్ ఎంటర్టైన్మెంట్స్ , మంకీ మస్సాక్రె సంయుక్తంగా నిర్మించిన ఈ వెబ్ సిరీస్ నాల్గవ సీజన్ మే 27 నుండి స్ట్రీమింగ్ కానుంది.
ఈ సిరీస్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఇండియాలో కూడా ఈ సిరీస్ కు ఫాలోయింగ్ బాగానే ఉంది. దీంతో ఇండియాలో ఈ సిరీస్ కు మరింత పాపులారిటీని తీసుకొచ్చేందుకు, నెట్ ఫ్లిక్స్ , మ్యూజిక్ మ్యాస్ట్రో తో డీల్ కుదుర్చుకుంది.
స్ట్రేంజర్ థింగ్స్ థీమ్ మ్యూజిక్ ను ఇండియన్ వర్షన్ లో ట్యూన్ చేసారు ఇళయరాజా. క్లాసికల్ ట్యూన్స్ తో కంపోజ్ చేసిన ఈ వీడియోను తాజాగా నెట్ ఫ్లిక్స్ సంస్థ విడుదల చేయగా సబ్ స్క్రైబర్ల నుండి విశేష స్పందన వచ్చింది. ఈ మ్యూజిక్ నే ఒరిజినల్ ఎపిసోడ్స్ లో పెట్టాలని వారు కోరుకుంటున్నారు. మరి వీక్షకుల కోరికను నెట్ ఫ్లిక్స్ మన్నిస్తుందో లేదో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa