తమిళ స్టార్ హీరో విజయ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ తెలుగు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన గురువారం ఓ కీలక అప్‌డేట్ ఇచ్చారు చిత్ర బృందం. ఈ సినిమా షెడ్యూల్ పూర్తయినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలో హీరో శ్రీకాంత్, ప్రభు, శరత్‌కుమార్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమాని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa