టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, తన డైరెక్షన్లో వచ్చిన ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ 'ఎఫ్ 3' ని చేస్తున్నారన్న విషయం తెలిసిందే కదా. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లీడ్ రోల్స్ లో నటించిన మల్టీస్టారర్ గా ఎఫ్ 3 చిత్రం తెరకెక్కింది. ఇందులో వెంకటేష్ కు జంటగా మిల్కీ బ్యూటీ తమన్నా, వరుణ్ కు జోడిగా మెహ్రీన్ నటించారు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించారు. భారీ అంచనాలు నడుమ మే 27న అంటే ఈ రోజే థియేటర్లలో విడుదలైంది.
తాజాగా ఈ మూవీ ఓటిటి డీల్ క్లోజ్ అయిందని తెలుస్తుంది. ప్రముఖ సోనీ లివ్ సంస్థ, మరో ఓటిటి అమెజాన్ ప్రైమ్ వీడియో తో పోటీపడి మరీ ఎఫ్ 3 ఓటిటి రైట్స్ ని కొనుగోలు చేసిందట. ఈ క్రమంలో సోనీ లివ్ కళ్లుచెదిరే ధరకి డీల్ క్లోజ్ చేసుకుందని తెలుస్తుంది. ఎఫ్ 3 చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం సోనీ లివ్ మేకర్స్ కు రూ. 18 కోట్ల భారీ మొత్తాన్ని అందించిందని వినికిడి. ఇక థియేటర్లలో ఎఫ్ 3 మూవీ పాజిటివ్ టాక్ ను తెచుకుందంటే సోని లివ్ సంస్థకు కాసుల వర్షం కురిసినట్టే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa