బిగ్‌బాస్ తెలుగు సీజన్-5లో విన్నర్‌గా నిలిచిన సన్నీ హీరో కానున్నాడు. సీమశాస్త్రి, పిల్లా నువ్వు లేని జీవితం వంటి సినిమాలకు మాటలు అందించిన డైమండ్ రత్నబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ త్వరలోనే విడుదల కానున్నట్లు శుక్రవారం ప్రకటన వెలువడింది. సన్నీ సరసన నటించే హీరోయిన్ కోసం అన్వేషణ సాగుతోంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరించే కమర్షియల్ హంగులు ఉండే కథను సన్నీ కోసం తయారు చేశారు.