దర్శకధీరుడు రాజమౌళి తెలుగులో సమర్పిస్తున్న బాలీవుడ్ ప్రెస్టీజియస్ చిత్రం బ్రహ్మాస్త్ర. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటిస్తున్న చిత్రం బ్రహ్మాస్త్ర. మోడరన్ మైథలాజికల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, మౌని రాయ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం 2022 సెప్టెంబర్ 9న విడుదలవనుంది.
బ్రహ్మాస్త్ర... పోస్టర్లు, హీరో, హీరోయిన్ ఇంట్రడక్షన్ ప్రోమోలను బట్టి శివుడికి సంబంధించిన సినిమాగా తెలుస్తుంది. ఇందులో హీరో పేరు కూడా శివే. ఈ మూవీ ఎక్కువశాతం వారణాసిలో షూటింగ్ జరుపుకుంది. సినిమాకోసం దేశవ్యాప్తంగా ఎన్నో శివుని ఆలయాలను సందర్శించిన చిత్రబృందం తాజాగా ఆంధ్రప్రదేశ్, వైజాగ్ లోని ప్రముఖ శివాలయాలను సందర్శించి, ఆ సమయంలో బ్రహ్మాస్త్ర మూవీ ప్రమోషన్స్ చెయ్యాలనే ఆలోచన చేస్తుందట. ఈ క్రమంలో రణ్ బీర్ అండ్ టీం కు జక్కన్న కంపెనీ ఇవ్వనున్నారట. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్రబృందం త్వరలో వెలువరించనుందట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa