జై జాస్తి, అనంతిక సనీల్‌కుమార్ జంటగా నటించిన సినిమా 'రాజమండ్రి రోజ్ మిల్క్'. ఈ సినిమాకి నాని బండ్రెడ్డి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ సినిమా రెండవ షెడ్యూల్ జూన్ 10 న ప్రారంభమవుతుంది. రాజమండ్రి మరియు వైజాగ్‌లలో చిత్రీకరించబడుతుంది అని చిత్ర బృందం తెలిపింది.ఈ సినిమాలో వెన్నెల కిషోర్, ప్రవీణ్‌లు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ మరియు ఇంట్రూప్ ఫిల్మ్స్ నిర్మించాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa