బాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా లీడ్ రోల్ లో నటించిన చిత్రం "బధాయి హొ". 2018లో విడుదలైన ఈ చిత్రం ఉత్తరాదిన సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా కధేంటంటే..., హీరో తల్లి నడివయసులో గర్భం దాల్చుతుంది. దీంతో హీరో, అతని గర్ల్ ఫ్రెండ్ ల మధ్య ఉన్న బాండింగ్ కాస్త దెబ్బ తింటుంది. ఈ మూవీ ని తెలుగులో రీమేక్ చేద్దామని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సురేష్ బాబు హక్కులను కొనుక్కున్నారు. అయితే, ఇప్పటివరకు ఆ మూవీ ఊసే ఎత్తట్లేదు సురేష్ బాబు. ముందుగా లీడ్ రోల్ లో నటించేందుకు నాగ చైతన్య ఒప్పుకున్నాడని ప్రచారం జరిగింది.., కానీ అందుకు సంబంధించిన ప్రకటనలేవీ రాలేదు. ఆ తర్వాత యంగ్ హీరో రాజ్ తరుణ్ లీడ్ రోల్ లో ఈ సినిమా తెరకెక్కబోతుందని అన్నారు ..తర్వాత అది కూడా రూమరే అని తేలిపోయింది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు, ఈ సినిమాలో నటించటానికి ఏ హీరో ముందుకు రావట్లేదట.
తెలుగులో ఈ మూవీని తెరకెక్కించటానికి సురేష్ బాబు నానా కష్టాలు పడుతుంటే, బోనీ కపూర్ మాత్రం తమిళ్ లో ఈ సినిమాను మొదలెట్టేసి షూట్ కూడా కంప్లీట్ చేశారు. వీట్ల విశేషం టైటిల్ తో RJ బాలాజీ లీడ్ రోల్ లో, అతని తల్లితండ్రులుగా ఊర్వశి, సత్యరాజ్ లు నటించారు. NJ శరవణన్ ఈ సినిమాను డైరెక్ట్ చేసారు. ఇలాంటి విభిన్నమైన స్టోరీ లైన్స్ ను వెతికి మరీ రీమేక్ చూస్తున్న కోలీవుడ్ ను చూసి కొత్తదనాన్ని ఇష్టపడని టాలీవుడ్ ఎంతో నేర్చుకోవాలని కొంతమంది అభిప్రాయం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa