టాలీవుడ్ చరిత్రలో డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా పేరు తెచ్చుకున్న హీరో నటశేఖర్ కృష్ణ. తెలుగు వెండితెరను విస్తృత పరిచిన ఘనత కృష్ణ సొంతం. చిన్న క్యారెక్టర్లతో సినీ కెరీర్ ను స్టార్ట్ చేసిన కృష్ణ "తేనె మనసులు" చిత్రంతో లీడ్ హీరోగా మారారు. గూఢచారి 116, మోసగాళ్లకు మోసగాడు, అల్లూరి సీతారామరాజు , పండంటి కాపురం వంటి హిట్ చిత్రాలలో నటించారు. సొంతంగా పద్మాలయ స్టూడియోస్ ను స్థాపించి సినిమాలను నిర్మించడం ప్రారంభించారు. వరసగా 14 ఫ్లాప్స్ ను చూసిన ఘనత ఆయనదే. వాటి నుండి బలమైన రీఎంట్రీ సాధించిన ఘనత కూడా ఆయనదే.
నేడు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు. నేటితో ఆయన 79ఏళ్ళ ను పూర్తి చేసుకున్నారు. దీంతో కృష్ణ తనయుడు మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలను తెలిపారు. హ్యాపీ బర్త్ డే నాన్న... మీలాంటి ఉన్నతమైన వ్యక్తి మరొకరుండరు. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని, భగవంతుడి ఆశీస్సులు ఆయనకు ఎల్లప్పుడూ ఉండాలని మహేష్ ట్వీట్ చేసారు.
Happy birthday Nanna! There is truly no one like you. Wishing for your happiness & good health for many more years to come. Stay blessed always. Love you pic.twitter.com/rJKvVQoHQq
— Mahesh Babu (@urstrulyMahesh) May 31, 2022
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa