నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన సినిమా 'కార్తికేయ'. ఈ సినిమాకి చందు ముండేటి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. తాజాగా 'కార్తికేయ' సినిమాకి సీక్వెల్ గా 'కార్తికేయ-2' విడుదలకు సిద్ధమైంది.ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుందని చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్‌ను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. 'కార్తికేయ-2' సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ ను జూన్ 1న రేపు (జూన్ 1) ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.