బిగ్ బాస్ ఫేమ్ విజే.సన్నీ హీరోగా నటిస్తున్న సినిమా 'అన్‌స్టాపబుల్' (నో డౌట్ 100% ఎంటర్టైన్మెంట్). ఈ సినిమాలో సప్తగిరి కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమాకి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత వి.విజయేంద్రప్రసాద్, దర్శకుడు బి.గోపాల్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, హీరో తనీష్, నటుడు బిత్తిరి సత్తి తదితరులు పాల్గొన్నారు.