విశ్వనటుడు కమల్ హీరోగా నటించిన సినిమా 'విక్రమ్'. ఈ సినిమాకి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించాడు.ఈ సినిమాలో విలక్షణ నటులు విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, ప్రత్యేక పాత్రలో హీరో సూర్య నటించటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జరిగింది. ఈ సినిమా ఈవెంట్ కి వెంకటేశ్, నితిన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సినిమా ఈవెంట్లో వెంకటేశ్ మాట్లాడ్తూ.... కమల్ సర్ నటనకు 60 ఏళ్లు. ఇంకా 16 ఏళ్ల వయసున్నవారిలాకనిపిస్తున్నాడు.'దశావతారం' లాంటి సినిమా చేశా సాహసం మరే నటుడు చేయలేదు. 'ఏక్ దూజే కే లియే' సినిమాతో తొలి పాన్-ఇండియా స్టార్‌గా నిలిచాడు. కమల్ హాసన్ తో క్లాస్, మాస్ దర్శకులంతా సినిమా చేయాలనుకుంటుంటారు.నటుడిగా కమల్ నుంచి చాలా నేర్చుకున్నాను.ఈ సినిమా మంచి విజయం సాధించాలి'' అని వెంకటేష్ అన్నారు.ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషలలో జూన్ 3వ తేదీన విడుదల కానుంది.