విశ్వనటుడు కమల్ హీరోగా నటించిన సినిమా 'విక్రమ్'. ఈ సినిమాకి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించాడు.ఈ సినిమాలో విలక్షణ నటులు విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, ప్రత్యేక పాత్రలో హీరో సూర్య నటించటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జరిగింది. ఈ సినిమా ఈవెంట్ కి వెంకటేశ్, నితిన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సినిమా ఈవెంట్లో కమల్ హాసన్ మాట్లాడ్తూ....‘‘45 ఏళ్ల క్రితం డ్యాన్స్ అసిస్టెంట్‌గా తొలిసారి హైదరాబాద్‌కు వచ్చాను.. అక్కినేని నాగేశ్వరరావు ‘శ్రీమంతుడు’ సినిమా చేశాను. అప్పటి నుంచి నేను తెలుగు వారి ఆహారం తింటున్నా. నాకు తెలుగులోనే వరుస విజయాలు వచ్చాయి. నేను కె.బాలచంద్రన్‌తో కలిసి 36 సినిమాలు చేశాను. అదే నాకు నటనలో పీహెచ్‌డీ. ఈ సినిమాకి మంచి టీం దొరికింది. ఈ సినిమాకి అనిరుద్ మంచి సంగీతం అందించాడు. పాన్ ఇండియా చాలదు అండి పాన్ వరల్డ్ మూవీ రావాలి. మంచి సినిమా కావాలి అని ప్రేక్షకులు అడిగితే మేము ఇవ్వడానికి రెడీ గా ఉన్నాము. నాతో సినిమాలు చేసిన దర్శక నిర్మాతలు, సహ నటులు, నన్ను ఆదరించిన అభిమానులుకు కృతజ్ఞతలు’’ అని కమల్ హాసన్ అన్నారు.